- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుండిగల్‌లో ఏళ్లుగా సాగుతున్న దోపిడీ..రాజకీయ వత్తిళ్లే కారణమంటూ విమర్శలు
దిశ,దుండిగల్ : పాలనపై అవగాహన లేని మున్సిపల్ అధికారుల పనితీరు అక్రమార్కులకు వరంగా మారింది. దుండిగల్ మున్సిపల్ ఆదాయానికి గండి పడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడాల్సిన భవనాలు కళ్ళు కాంపౌండ్ లకు నిలయాలుగా మారాయి. మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోని ప్రభుత్వ షెట్టర్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి వారికి ఆదాయ వనరులుగా మారాయి. దుండిగల్ గ్రామంలో కళ్ళు కాంపౌండ్ మున్సిపల్ షెట్టర్స్ రూపంలో ఏళ్ల తరబడి ఘరానా దోపిడీకి అడ్డుకట్ట పడడంలేదు. మున్సిపాలిటీ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అధికారులు సబంధం లేనట్లుగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్న మున్సిపల్ అధికారుల తీరు మారడం లేదు అనడానికి దుండిగల్ గ్రామంలో తక్కువ ధరకు కేటాయించిన కమర్షియల్ షెట్టర్స్,కళ్ళు కాంపౌండే నిదర్శనం. దుండిగల్ గ్రామంలో గతంలో గ్రామ సర్పంచ్ సదానందం గౌడ్ పాలక వర్గం నేతృత్వంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 15 షెట్టర్స్,కళ్ళు కాంపౌండ్ పై సంవత్పరాలుగా ప్రైవేట్ వ్యక్తులు చలామణి చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు అద్దె రూపంలో కేటాయించాల్సి వస్తే పాలకవర్గం తీర్మానం తప్పనిసరి. దుండిగల్ గ్రామంలో ఎటువంటి తీర్మానం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు కమర్షియల్ షెట్టర్ల,కళ్ళు కాంపౌండ్ కేటాయించడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఆస్తుల పై నియంత్రణ కరువు..
గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గా అవతరించిన వెంటనే పంచాయతీ రాజ్ ఆస్తులు మున్సిపాలిటీకి ఆటోమేటిక్ గా బదలాయింపు జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులపై నియంత్రణ కోల్పోయిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ తోపాటు,ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అధికారులు సంబంధం లేనట్లుగా వ్యవహరించడంతోనే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుండిగల్ గ్రామంలో అప్పటి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆదాయ వనరులు కోసం గ్రామంలోని బస్ స్టాండ్ సమీపంలో 15 షెట్టర్స్,తెలుగు తల్లి విగ్రహం వద్ద కమర్షియల్ భవనాలు నిర్మించి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ముందు గ్రామ పంచాయతీ తీర్మానం లేదా అగ్రిమెంట్ పొందుపరిచి ఉండాల్సింది. ఎటువంటి తీర్మానం లేకుండా కేవలం రూ. 500 నుంచి 800లకు ఒక షెట్టర్ ను అప్పట్లో కేటాయించారు. కాలం మారుతున్న అధికారులు పట్టించుకోలేదు. పంచాయతీ పాలకవర్గం కన్నెత్తి చూడలేదు. ఇప్పటికి అదే అద్దె కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు,మున్సిపల్ ఆదాయానికి నెలకు సుమారు రూ. లక్షకు పైగా గండిపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అద్దె చెల్లించని కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు..
దుండిగల్ గ్రామంలో ప్రజాప్రయోజనాయలకు నిర్మించిన భవనాలను 15 సంవత్సరాల క్రితం కళ్ళు కాంపౌండ్ కోసం ప్రైవేటు వ్యక్తులకు రూ. 1500 అద్దెకు కేటాయించారు. సంవత్సరాలు గడుస్తున్నా పాత అద్దె చెల్లించేందుకు సదరు వ్యక్తులు మొగ్గు చూపకపోవడం,6 నెలలుగా అద్దె బకాయిపడ్డ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. సంవత్సరాల రూ. 20 లక్షల ఆదాయం ఆర్జించే కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు నెల నెలా కనీస అద్దె చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అద్దెకు వెళ్లిన మున్సిపల్ బిల్ కలెక్టర్లపై సదరు వ్యక్తులు తిరగబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ భవనంలో కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తూ భారీగా ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ఆడిట్ నిర్వహించి మున్సిపల్ చట్టం ప్రకారం కచ్చితంగా అద్దె వసూలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?
దుండిగల్ గ్రామంలో కమర్షియల్ షెట్టర్స్,కల్లూకంపౌండ్ అద్దె పెంచకపోవడానికి రాజకీయ వత్తిళ్లే కారణంగా తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడం,తాళం వేసేందుకు వెళితే రాజకీయ నాయకుల నుండి ఒత్తిళ్ళు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారిని సునందను వివరణ కోరగా అద్దె చెల్లింపు విషయం మా దృష్టిలో ఉందన్నారు. పంచాయితీ పాలక వర్గం నుండి ఇప్పటి వరకు ఒక్కో షెట్టర్ కు రూ. 800 చెల్లిస్తున్నది వాస్తవమే అన్నారు. నెల రోజుల కృితం జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించి రూ. 2000 అద్దెగా చేయాలని ఆదేశించారని 2025 ఏప్రిల్ నెల నుంచి కొత్త అద్దె అమలు అవుతుందన్నారు.
దుండిగల్ లో అమలుకానీ మున్సిపల్ చట్టం..
గ్రామ పంచాయతీ హయాంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 15 షెట్టర్స్ ను మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ తీర్మానం చేసి పంచాయతీ నిధులతో నిర్మించిన భవనాలను అప్పగించింది. మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తవుతున్న గ్రామ పంచాయతీ పాలక వర్గం నుండి అమలు అవుతున్న అద్దె ఇప్పటికి కొనసాగుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది. 600 గజాలలో నిర్వహిస్తున్న కళ్ళు కాంపౌండ్ కు మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపల్ చట్టం ప్రకారం సర్వసభ్య సమావేశంలో తీర్మానించి ఎస్ ఎఫ్ టి ప్రకారం అద్దె వసూలు చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ. 20 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు నెలకు కేవలంరూ. 1500 మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కళ్ళు కాంపౌండ్ ను ప్రజాప్రయోజనాయలకు కేటాయించాలి..
కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో కేవలం 1500 లకు కళ్ళు కాంపౌండ్ కు కేటాయించడం విడ్డూరంగా ఉందని,మున్సిపల్ కమిషనర్,అధికారుల పనితీరుకు ఇది నిదర్శనమని గ్రామస్తులు వాపోతున్నారు.గతంలో వ్యవసాయ మార్కెట్ నిర్వహిస్తున్న స్థలంలో కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకొని కూరగాయల మార్కెట్ కు గాని,ఫంక్షన్ హాల్ గాని నిర్మించి ప్రజా అవసరాలకు వినియోగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.