- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alwal circle : అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అల్వాల్ సర్కిల్ టౌన్ ఫ్లానింగ్ కార్యాలయం..
దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ మారింది అంటే అతిశయోక్తి కాదు. అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరింత అద్వనం ఆడినంత ఇచ్చుకో ఎంతయినా కట్టుకొ అనే విధంగా ఉందంటే దాని రీతిరివాజులు ఎంత బాగనడుస్తున్నాయో ఇట్టే అర్థం అవుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఒక క్రమబద్దమైన పట్టణ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన టౌన్ ఫ్లానింగ్ సెక్షన్ అధికారులు తను చేయవలసిన పని పక్కన పెట్టి అడ్డగోలు నిర్మాణాలకు అక్రమ నిర్మాణాలకు అనుమతి అధికారులుగా మారారు అంటే వారి పని విధానం ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
పలాన ఏరియాలో అనుమతిలేని నిర్మాణాలు విరివిగా జరుగుతున్నాయి అంటే వాటి అన్నింటికి నోటీసులు ఇచ్చాం త్వరలోనే మరో నోటీస్ ఇస్తాం అంటూ కాలయాపన చేస్తూ అ నిర్మాణం పూర్తి అయ్యెలా పరోక్షంగా అధికారులు సహారిస్తున్నట్లు అల్వాల్ వాసులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణ దారులకు అండగానిచిన అధికారులు అల్వాల్ పట్టణాన్ని అల్లిబిల్లి పట్టణంగా మార్చుతూ అధికారులు కోట్లకు పడిగెత్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమాలపట్ల చూచి చూడనట్లు వ్యవహరించిన అధికారులపై సంస్థపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పౌరులు కోరుతున్నారు.