కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం

by Sridhar Babu |   ( Updated:2024-10-24 12:40:01.0  )
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం
X

దిశ, కుత్బుల్లాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలు వరం అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేయర్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆయా పథకాలకు చెందిన లబ్ధిదారులకు వారు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి చేయూతనివ్వడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

అనంతరం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే, మేయర్ నీలా గోపాల్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఓపెన్ జిమ్ లను సక్రమంగా నిర్వహించాలని, చెత్త తరలింపులో జాప్యం వీడాలని, ప్యాచ్ వర్క్ పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, ఇన్​చార్జి కమిషనర్ దిలీప్​ కుమార్, కార్పొరేటర్ లు, కో ఆప్షన్ సభ్యులు, పలు విభాగాల మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed