జువెలరీ షాప్ దొంగల అరెస్టు.. రూ.18 లక్షల బంగారం స్వాధీనం

by Nagam Mallesh |
జువెలరీ షాప్ దొంగల అరెస్టు.. రూ.18 లక్షల బంగారం స్వాధీనం
X

దిశ, శామీర్ పేట: నగల షాపులో చోరీకి పాల్పడిన ఇద్దరు నింధితులను శామీర్ పేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18 లక్షల విలువైన బంగారు,వెండి అభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డిసిపి కోటి రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణ జ్యూవెల్లరీ షాప్ లో నగలు చోరీ జరిగిన విషయం తెలిసేందే. రాజస్థాన్ కు చెందిన ఒకే పేరు గల శంకర్ సింగ్ (25), శంకర్ సింగ్ (23)లు గత కొంతకాలం క్రితం హైదరాబాద్ కి వచ్చారు. వృత్తి రీత్యా తాత్కాలిక డ్రైవర్ లు గా కొంపల్లిలో ఆటో, కార్ లను డ్రైవ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డబ్బులు తమ అవసరాలకు సరిపోవడం.. స్థిరపడాలంటే ఏదైనా పెద్ద మొత్తంలో చోరీ చేయాలని ప్లాన్ వేశారు. తనకు తెలిసిన రాజస్థాన్ కు చెందిన ఇద్దరు స్నేహితులు హనుమంత్ సింగ్ (25), జలం సింగ్ (20) లను పిలిపించుకొని వారితో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 4 న గజ్వెల్ మార్కెట్ వద్ద ఒక పల్సర్ బైక్ ను దొంగతనం చేసి, మరుసటి రోజు నలుగురు కలిసి అల్వాల్ సూర్యనాగర్ కాలనీ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. పథకం ప్రకారం తూంకుంట కు వచ్చి రెక్కీ నిర్వహించారు. రెక్కీలో భాగంగా శ్రీ కృష్ణ జ్యూవెల్లరీ షాప్ లో చోరీ చేయడానికి నిర్ణయిచుకున్నారు. 6వ తేదీన రాత్రి రాడ్డు సహాయంతో షెట్టర్ ను పైకి లేపి, బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చర్యలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి విచారణలో భాగంగా దాదాపు 300 సిసి కెమెరాల పర్యవేక్షణలో నమ్మదగిన సమాచారం మేరకు అల్వాల్ సూర్య నగర్ కాలనీలో నింధితులు ఉంటున్నారని గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి శంకర్ సింగ్ పేరు గల ఇద్దరు నింధితులను ఆదుపులోకి తీసుకోగా, హనుమంత్ సింగ్, జలం సింగ్ లు పరారీలో ఉన్నారు. విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 11.5 తులాల బంగారు ఆభరణాలు, 46 కిలోల వెండి, 2 సెల్ ఫోన్ లతో పాటు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్న డీసీపీ క్రైమ్ కె. నరసింహ, ఏసిపి కె. రాములు, ఏసిపి కె.కళింగరావ్, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, శామీర్ పేట డి ఐ నర్సింహ రాజు, అల్వాల్ డిఐ రాజేందర్, నరసింహ, రాజు, శామీర్ పేట్ ఎస్సై మునిందర్, వెంకట్, రాజు, సిబ్బందిని డిసీసీపిలు కోటి రెడ్డి, నరసింహలు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed