- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైతులకు మద్ధతిస్తే అక్రమ కేసులా ?
దిశ, కాప్రా : వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతులకు మద్ధతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని లో కుట్ర కేసులో అరెస్టు చేశారని, రాష్ట్రంలో ఏమి జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. గురువారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న నరేందర్ రెడ్డిని ములాఖత్ లో కలిసి పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు కొడంగ్ నుంచే మొదలైందని, అన్యాయంగా పేదల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నాయకులను వేధించినా బీఆర్ ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందన్నారు. అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే, రైతులు రోడ్ల మీదకు వస్తే , గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పీడిత వర్గాలకు అండగా బీఆర్ఎస్ నిలుస్తుందన్నారు. కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. తన న్యాయ పోరాటంలో నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావడం ఖాయమని అన్నారు. హరీష్ రావు వెంట ములాకత్ లో ఎమ్మెల్యేలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నాయకులు కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్, పార్టీ శ్రేణులున్నారు.