- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్ భగాయత్‌లో నూతన అగ్నిమాపక స్టేషన్ ప్రారంభం
దిశ,ఉప్పల్: తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక పోలీస్, అగ్నిమాపక శాఖలలో అవకాశాలు ఎక్కువ వచ్చాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఎల్బీనగర్ నూతన ఫైర్ స్టేషన్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసి హోంమంత్రి మహమూద్ అలీ,స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో తో కలిసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 ఫైర్ స్టేషన్ లను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం లో శుక్రవారం ఒక్కరోజు 18 నూతన ఫైర్ స్టేషన్ లను ప్రారంభించామన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 43 ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రాణం ఇస్తా సేవ చేస్తా అనే విధంగా అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తుందని, తెలంగాణ వచ్చాక నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని మొత్తం రాష్ట్రంలో 137 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయని హోమ్ మంత్రి తెలిపారు.విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూన్న ఆపిసర్ లకు ప్రెసిడెంట్ మెడల్,రాష్ట్ర మెడల్స్ పంపిణీ చేశామని, నూతన టెక్నాలజీతో ఫైర్ స్టేషన్ లను ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి,పైర్ డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్,అడిషనల్ డెరైక్టర్ జీవీ నారాయణ రావు, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ రావు, డీఎఫ్ఓ నాగేశ్వర్ రావు, ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.