- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను మల్కాజ్ గిరి సైనికుడిని : ఈటల
దిశ, మేడ్చల్ బ్యూరో : నేను మల్కాజ్ గిరి సైనికుడిని అని బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ కౌంటింగ్ సెంటర్ లో మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడారు. బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. మీ విశ్వాసానికి తగ్గట్టు తన పని విధానం ఉంటుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడడంతోపాటు.. మోదీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి,రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు.17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో 300 సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛ స్వాతంత్య్రం - ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి మల్కాజ్ గిరి ప్రజలు ఓటు వేశారని తెలిపారు. ప్రధాని మోదీ ఈ పదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారని తెలిపారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసారన్నారు.
నా మీద విశ్వాసం ఉంచి గెలిపించి, ఏ రౌండ్ లో మెజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారని ఈటల సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఇండస్ట్రియల్ కారిడార్, అన్ని నెరవేరుస్తానన్నారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, నోట్లో నాలుకలా మెదులుతానన్నారు.నాకు సహకరించిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తనకు ఓటు వేస్తే సేఫ్ గార్డ్ ఉంటుంది అని, ప్రగతికి పునాది పడుతుందని అని ఓట్లు వేశారని తెలిపారు. పొత్తుల సద్ది లా ఉంటా అని హామీ ఇస్తున్నా అని ఈటల అన్నారు. పది సంవత్సరాల తరువాత కూడా దేశ ప్రజలు మోడీ ని కోరుకుంటున్నారు అంటేనే వారి పట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.