- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -3 రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. పరీక్ష విధులు నిర్వహిస్తున్న అధికారులంతా సమన్వయంతో మెలిగి ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. టీసీపీఎస్సీ గ్రూప్ -3 రాత పరీక్షపై గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీఫ్ సూపరింటెండెంట్లు, ప్లైయింగ్ స్వాడ్స్, రూట్ ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.
చీఫ్ సూపరింటెండెంట్లు ముందస్తుగా పరీక్షా కేంద్రాలను పరిశీలించి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ గ్రుప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.సెక్యూరిటీ, విద్యుత్, తాగునీరు, ఆర్టీసీ బస్సుల కోసం ఆయా అధికారులతో సమన్వయం చేసుకొని, తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ఒకరోజు ముందుగానే మీకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను పరిశీలించుకోవాలన్నారు. పరీక్షా సెంటర్లలో రూట్ మ్యాప్ లు, సైన్ బోర్డ్స్, సీటింగ్ అరేంజ్ మెంట్ సరిగా ఉన్నాయా అని పరిశీలించాలన్నారు.
ఈ పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న అధికారులందరి మోబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు వారి నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ -3 పరీక్షలకు ప్లైయింగ్ స్వాడ్స్,రూట్ ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.