- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్వాల్ సర్కిల్లో పడకేసిన పారిశుద్ద్యం..
దిశ, అల్వాల్ : మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం తంగెళ్లు దాటవు అనే చందంగా ఉంది అల్వాల్ సర్కిల్ అధికారుల పనితీరు. నిత్యం పచ్చదనం పరిశుభ్రత అంటూ సర్కిల్ కార్యాలయం ముందు మొదలుకొని వీధి వీధి వాడవాడలో అవగాహన సమావేశాలు నిర్వహించే అధికారులు ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు, ఎక్కడోళ్లు అక్కడ వెళ్లుడు. ఇక మా డ్యూటీ అయిపోయింది అనుకుంటూ ఎవ్వరిదారిన వారు పోవడం తప్పితే పరిశుభ్రతకోసం పచ్చధనం కోసం వారు చేసింది ఏమిలేదంటున్నారు అల్వాల్ వాసులు. అందుకు నిదర్శనం బస్తీలు కాలనీలలో పేరుకు పోయిన చెత్తె కారణం అంటున్నారు. ఒక పక్క పరిశుభ్రమైన నగర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి మురికిని అంత సాపు చేస్తుంటే, అల్వాల్ సర్కిల్ బస్తీలు, కాలనీలు చెత్త కంపు కాల్చివేసే పోగతో పొగమయం అవుతున్నాయి.
చెత్తను అసలే కాల్చవద్దని ఎక్కడి చెత్తనైనా డంపింగ్ యార్డుకు పంపే ఏర్పాట్లు చేసింది. కేవలం చెత్తను డంపింగ్ యార్డుకు పంపడానికే రాంకీ లాంటి పెద్ద సంస్థ భారీ వాహనాలు ఏర్పాటు చేసి 24 గంటలు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాయి. అయిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఎక్కడికక్కడ తగలబెడుతున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. శుక్రవారం కిష్టమ్మ ఎంక్లేవ్ ప్రధాన రహదారిలో రోడ్డు పక్కన చెత్తను తగలబెట్టడడంతో ఆ ప్రాంతం అంత పొగమయం అయింది. అక్కడ ప్రధాన రహదారి ఉండడం దానికి తోడు రైల్వే గేటు పడడంతో రోడ్డు పై వాహనాలు నిలిచాయి దీంతో పొగ వాహదారుల మీదికి రావడంతో పోగ మూలంగా ఇబ్బంది పడ్డారు. కొందరైతే అప్పటికప్పుడు కర్చీపులను మూతికి కట్టుకుని పొగనుండి రక్షణ పొందుతున్నారు.
అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడమే పొగలు గమ్మడం..
చెత్తను కాల్చవద్దని దాని నుండి వచ్చే పొగ భారీ ఎత్తున కాల్యుషానికి కారణం అవుతుందని గుర్తించిన అధికారులు చెత్తను ఎక్కడ కూడా కాల్చవద్దని చివరకు డంపింగ్ యార్డులో సైతం కాల్చవద్దని తగిన నిబంధనలు విధించారు. అందుకు అనుగుణంగా పర్యవేక్షణ అధికారులకు చెత్త కాల్చడం వలన వెలువడే పొగఎంత ప్రమాదకరంమో తదితర విషయాల పై అవగాహన కలిగించారు. అయినా వారు అవన్ని ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంతోనే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లక పోవడం మూలంగా కింది స్థాయి సిబ్బంది వారికి తోచిన విధంగా చెత్తను లేకుండా చేసి చేతులు దులుపుకుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి. శానిటేషన్ కు సంబంధించిన అధికారులు సూపర్ వేజర్లు పర్యవేక్షన నిత్యం ఉండాలని అల్వాల్ వాసులు కోరుతున్నారు.