ganja seized : 13 కేజీల గంజాయి స్వాధీనం

by Kalyani |
ganja seized : 13 కేజీల గంజాయి స్వాధీనం
X

దిశ, మేడ్చల్ బ్యూరో: రూట్ వాచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీలలో 13 కేజీల గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద గంజాయి అమ్మకాలపై వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అటుగా వెళుతున్న చల్ల మల్ల శరత్, గుణశేఖర్ ల వద్ద నుంచి 8.6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కబాబ్ సెంటర్ నిర్వహించే కటికల విజయ్ ఇంటిలో తనిఖీలు చేయగా అక్కడ 4.4 కేజీల గంజాయి దొరికింది. వీరు సీలేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. మొత్తంగా వీరి వద్ద నుంచి 13 కిలోల గంజాయి అదే విధంగా ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ్ తెలిపారు.



Next Story

Most Viewed