REAL HERO: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం

by Kavitha |
REAL HERO: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ బయట రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా టైంలో నేనున్నా నంటూ భరోసా ఇచ్చి ఎంతో మందిని ఆదుకున్నాడు. అంతేకాదు సోనూసూద్ సాయం వల్ల ఎంతో మంది జీవితాలు తారుమారు అయ్యాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఆపద్బాంధవుడులా ముందుంటాడు. ఈయన చేసిన సేవా కార్యక్రమాలకు గానూ యావత్ భారతదేశం శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కష్టం వచ్చిందంటే చాలు నేనున్నా అంటూ కష్టం కంటే ముందే ఉంటాడు. అలాంటి మహనీయుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సంపై స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. సాయం కోసం [email protected] ను సంప్రదించవచ్చు అని వరద బాధితులకు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆహారం, మెడిసిన్, ఇళ్లు లేని వారికి తాత్కాలిక షెడ్స్ వంటివి సాయం చేస్తున్న సోనూసూద్.. ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 2.5 కోట్లు(మొత్తం రూ. 5 కోట్లు) చొప్పున విరాళంగా ప్రకటించారు. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా, తన స్వచ్ఛంద సంస్థ ద్వారా బృందాలను పంపించి ఆహారం, మెడిసిన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన సోనూసూద్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కష్ట కాలంలో ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ తోడ్పాటు బలాన్నిస్తుంది అని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed