- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గాజులరామారం మెడికల్ ఆఫీసర్ సస్పెండ్..
దిశ, మేడ్చల్ బ్యూరో : విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్న గాజులరామారం బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ గా ఉన్నా డాక్టర్ జి.ప్రణీత్ ను ఆ పదవి నుండి తొలగిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఆకస్మిక తనిఖీలలో డాక్టర్ జి.ప్రణీత్ సమాచారం ఇవ్వకుండానే విధులకు రాకుండా ఉండటం, నిర్వహణ పరిపాలన నియమాలను ఏమాత్రం పాటించకుండా వ్యవహరించడం, ముఖ్యంగా రెగ్యులర్ చెక్-అప్స్, T-డయాగ్నస్టిక్స్ కోసం వచ్చే రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగించటం వంటి పరిణామాలను జిల్లా వైద్యశాఖ అధికారి తీవ్రంగా పరిగణించారు. దీంతో ఆయనను మెడికల్ ఆఫీసర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విధుల నిర్వహణలో వైద్య శాఖ సంబంధిత అధికారులు కచ్చితంగా నిబంధనలకు లోబడి పని చేయాలని, బస్తీ దావఖానాలకు వచ్చే వారికి అందించే సేవలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.