- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాబోయే దేశ ప్రధాని కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్ ప్రతినిధి: దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీస్తోందని, కాబోయే దేశ ప్రధాని కేసీఆర్ యేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బలగం సినిమా సక్సెస్ లాగానే ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతమవుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించి ఇంత పెద్ద(కార్యకర్తల) బలగాన్ని మనకు అందించారని తెలిపారు. బుధవారం మేడ్చల్ మండల రూరల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కండ్ల కోయ చౌరస్తాలోని నిమ్మల కన్వేన్షన్ లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధించిన నాటి నుంచి అన్ని రంగాల్లో పురోగతి సాధించి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుందని అన్నారు.
బీజేపీ కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపించాలన్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈడీ, ఐటీ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లలో పోటీచేసి గులాబీజెండా ఎగురవేస్తామని, కాబోయే ప్రధాన మంత్రి కేసీఆర్ అని జోస్యం చెప్పారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలన్నారు. తనకే మరోసారి టికెట్ ను కేటాయిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న మేడ్చల్ నియోజకవర్గంలో మూడోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనాల ఇంచార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రాజశేఖరరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ జిల్లా చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.