Bingo Lace : బింగో లేస్ పాకెట్స్ లో ఫంగస్

by Kalyani |
Bingo Lace : బింగో లేస్ పాకెట్స్ లో ఫంగస్
X

దిశ, శామీర్ పేట : బింగో లేస్ ప్యాకెట్ లో ఫంగస్ ఉండడంతో కొనుగోలు దారుడు బిత్తర పోయాడు. వివరాల్లోకి వెళితే... మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని గిరీష కిరాణా జనరల్ స్టోర్ దుకాణ సముదాయంలో నగరానికి చెందిన ఓ కొనుగోలుదారుడు ప్రతిరోజు అక్కడనే కిరణ సామాన్లు కొనుగోలు చేస్తాడు . రోజువారిగానే కొనుగోలుదారుడు శనివారం తన పిల్లలకు బింగో లేస్ ప్యాకెట్స్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి ప్యాకెట్స్ లో ఫంగస్ బూజు రావడంతో ఒక్కసారిగా అవాక్కు అయ్యాడు. కొనుగోలుదారుడు మూడు చింతలపల్లి మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా, డిప్యూటీ తహసీల్దార్ నాగజ్యోతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవసాగర్ తో కలిసి శిరీష కిరాణా షాపును తనిఖీ చేయగా, ఫంగస్ ఉన్న బెంగో లేస్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed