కలెక్టరేట్ ప్రాంగణంలో అంగ రంగ వైభవంగా దశాబ్ది సంబురం..

by Sumithra |
కలెక్టరేట్ ప్రాంగణంలో అంగ రంగ వైభవంగా దశాబ్ది సంబురం..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ప్రగతి పథంలో దూసుకువెళ్లుతున్న తెలంగాణ యావత్ దేశానికే తలమానికంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ దశాబ్ది వేడుకలు మేడ్చల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాతీయ పతకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. క్రీడకారులకు అవార్డులను ప్రధానం చేశారు. కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టిపెన్ రవీందర్, జెడ్పి ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, ఏనుగు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళ స్వయం సహాయక బృందాలకు రూ.18.35 కోట్ల చెక్కును, మెప్మాకు రూ.16.61 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. 176 మహిళ సంఘాలకు, 1,978 విధి వ్యాపారులకు ఈ నిధుల ద్వారా స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందాలని మంత్రి అకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర మేర్పడిన తర్వాత జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. గతంలో కరువు కాటకాలతో తెలంగాణ అల్లాడేదన్నారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండ్లలో నిండుగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ హాయంలో తెలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. జిల్లాలో వందలాది కోట్ల రూపాయాలతో అభివృద్ది జరుగుతుందన్నారు. అధికార యంత్రాంగం మరింత కష్టపడి పనిచేసి జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.

కీసర అమర వీరుల స్థూపం వద్ద నివాళి..

తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసరలోని అమర వీరుల స్థూపం వద్ద కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఇతర అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో అమర వీరుల చేసిన త్యాగాలను కొనియాడారు. అయర వీరుల కుటుంబాలను అదుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కీసర ఎంపీపీ ఇందిరా, సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed