- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి వెన్నెముక రైతులే
దిశ, శామీర్ పేట : దేశానికి వెన్నెముక రైతులే అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శామీర్ పేట రైతు వ్యవసాయ సహకార సంఘంలో గురువారం 71వ అఖిలభారత సహకార వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి మనిషికి పట్టెడు అన్నం పెట్టిననాడే దేశాభివృద్ధి అని, నిరుపేద దేశంగా ఉన్న భారత్ ఎదగాలంటే అన్ని వర్గాలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్పొరేట్ మోజులో, ప్రైవేట్ రంగాలు దూకుడుతో నేటి భారతదేశంలో గొప్పవారు గొప్పవారు గానే, పేదలు నిరుపేదలుగానే జీవిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ వెంట పరుగులు పెట్టడంతోనే అభివృద్ధికి బాటలు పడవన్నారు. ఏ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వచ్చిన కోట్ల మంది బిడ్డలకు ఆదుకునే పరిస్థితి లేదని, ఈ కార్పొరేటర్ సెక్టార్ వల్ల ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కేవలం టెక్నాలజీ, కార్పొరేట్ అంటే సరిపోదని లాభనష్టాలను చూడకుండా పనిచేసే వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు దేశంలో ఎవ్వరికీ దక్కనంత గౌరవం కేవలం రక్తాన్ని చెమటగా మార్చిన రైతన్నకు, దేశానికి సేవలందిస్తున్న జవాన్ కు మాత్రమే లభిస్తుంది అన్నారు. నూతన వంగడాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో కొత్తపెట్టబడులతో ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ విలాసాగరం సుదర్శన్, మాజీ సర్పంచులు గోల్డ్ శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, డి.మైసయ్య, ఐలయ్య యాదవ్, డైరెక్టర్లు, రైతులు అధికారులు పాల్గొన్నారు.