- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
21 నిమిషాల్లోనే అంతా అయిపోయింది.. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా ప్రాణం దక్కలేదు..
దిశ,రాచకొండ : ఓఆర్ఆర్ ఎక్కిన 21 నిమిషాలకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడింది. శామీర్పేట్ దగ్గర 4.51 నిమిషాలకు ఓఆర్ఆర్ ఎక్కిన లాస్య నందిత కారు 5.12 నిమిషాలకు పటాన్ చెరు పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత ముందు సీట్ లో కూర్చుండగా, పీఏ ఆకాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సీట్ బెల్ట్ ధరించినట్లు పటానచేరు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢీ కొట్టిన దాటికి ఎయిర్ బాగ్స్ బయటికి వచ్చినప్పటికి లాస్య నందిత ప్రాణాలు నిలువలేదు. ఆకాష్ కాలు విరిగిపోయింది. తలకు తీవ్ర గాయం అయింది. ప్రమాదంలో ముందు డోర్ లాక్ అవడంతో లాస్య ను ముందు వెనక సీట్ లోకి తీసుకువచ్చి ఆ తర్వాత వెనక సీట్ నుంచి కిందకు దించి హాస్పిటల్ కు తరలించారు.
లొకేషన్ పంపిన ఆకాష్ ..
ప్రమాదం జరిగిన వెంటనే ఆకాష్ తనకు గాయాలైనా ఆ భీతిల్లిన వాతావరణంలో వెంటనే తన ఫోన్ ద్వారా ఇద్దరికీ ఫోన్ చేసాడు. యాక్సిడెంట్ అయ్యింది కారులో మేడం కూడా ఉంది అంటూ సమాచారం ఇచ్చాడు. వారికి లొకేషన్ పంపాడు. వెంటనే ఆకాష్ ఫోన్ మాట్లాడిన బంధువు అమీనాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చి లొకేషన్ పంపాడు. అమీన్ పూర్ పోలీసులు పటాన్చెరు పోలీసులకు సమాచారం, లొకేషన్ ను పంపారు. విధుల్లో ఉన్న పటాన్చెరు పోలీసులు స్పాట్ కు వెళ్లే సరికి ఆకాష్ బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే స్థానిక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు బ్రాట్ డెడ్ గా ప్రకటించారు. అప్పుడు పోలీసు లకు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అని తెలిసింది.
గురువారం సాయంత్రం నుంచే గన్‌మెన్‌ను వద్దన్న లాస్య..
గురువారం సాయంత్రం సదాశివపేటలో ప్రైవేట్ ఫంక్షన్ ఉందని లాస్య నందిత గన్ మెన్ ను రావద్దని చెప్పిందని విచారణలో తెలిసింది. ముందుగా కుటుంబ సభ్యులతో వెళ్లిన లాస్య నందిత, ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి వెంటనే పని ఉందని ఆకాష్ ను తీసుకుని బయలు దేరి యాక్సిడెంట్ కు గురైందని పటానచెరు పోలీసు దర్యాప్తులో తేలింది. ఆకాష్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరు ఢీకొట్టిన వాహనం ఏది - నిద్రలేమి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పటానచెరు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే వీరు ఢీకొట్టిన వాహనం ఏది అయ్యి ఉండవచ్చని పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ తర్వాత వివిధ ఎగ్జిట్ లలో దిగిన వాహనాలు, టైం తో విశ్లేషిస్తున్నారు.
Read More : ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదానికి ముందు.. అసలేం జరిగింది?
ఎమ్మెల్యే లాస్య మృతికి కారణం అదే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు