పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే మర్రి

by Aamani |
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే మర్రి
X

దిశ, అల్వాల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితేనే లక్ష్యం నెరవేరుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం లోతుకుంటలోని ఇంద్రానగర్ కమ్యూనిటీ హాలులో విశ్వ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వ స్వచ్ఛంద సంస్థ వారు పేరుకు తగిన విధంగానే విశ్వ వ్యర్థరహిత హైదరాబాద్ 2027 అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్చందంగా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రభావశీలమైన కార్యక్రమాలతో ముందుకు పోవడం అభినందనీయం అన్నారు.

వ్యర్థ ఉత్పత్తులను ఉత్పత్తి అవుతున్న చోటనే నిర్మూలించి వాటిని భూమి లోకి చేరే ప్రక్రియను నిరోధించి భూమిని, పర్యావరణాన్ని ఏకకాలంలో పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు.మల్కాజిగిరి నియోజకవర్గంలో కాలుష్య రహిత వ్యర్థ రహిత ప్రాంతంగా ఏర్పాటు చేయుటకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సంస్థతో పాటు విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ అనే పర్యావరణ సేవకులు సహజ సమాజం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్న యువకుడు వినయ్ అతని అనుచరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా నగర్ కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, పెద్ది రమేష్, అరుణ్ కుమార్, వెంకటనారాయణ, సూర్యనారాయణ, మంచాల బ్రహ్మచారి కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed