- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీకి ఎందుకు ఓటేయ్యాలో అభినందన్ తల్లిని అడగండి: ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, మేడ్చల్ బ్యూరో: పదవి అలంకరణ, డాబు దర్పం కోసం కాదని, ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడానికేనని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్ గిరిలోని జైన్ బాలాజీ నిలయం వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో నేను పోల్చుకోనవసరం లేదన్నారు.. వారెక్కడ..? వారి అడ్రస్ ఎక్కడ.. వారి పనితనం ఎక్కడ..? అని ప్రశ్నించారు. రాజకీయాలంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్రోకరిజం, పైరవీలు చేయడం కాదన్నారు. డబ్బు ఖర్చు పెట్టడం మళ్ళీ సంపాదించుకోవడం తప్ప కాలికి ముల్లు విరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయలన్నా రాజకీయ నాయకుడి గురించి వారికి తెలయదన్నారు.
రాజకీయ నాయకులు అంటే ఓట్లప్పుడు వస్తారు, మళ్లీ కనిపించరు అనే భావన చాలామందిలో ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు నేను సేవకున్ని అని చెప్పుకుంటారని గుర్తు చేశారు. బాయ్ బాయ్ అని చెప్పి ప్రధాని ఓట్లు అడుగరని తెలిపారు. 365 రోజులు యంత్రంలాగా దేశంలో కోసం మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. మోదీకి ఎందుకు వేటు వేయాలో ఉక్రెయిన్‌లో చదువుకున్న తల్లిదండ్రులని అడుగాలని, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో అభినందన్ తల్లిదండ్రులని అడుగాలని కోరారు. ఒకనాడు ప్రపంచంలో లీడర్ అంటే అమెరికా, రష్యా, బ్రిటన్ కానీ ఈనాడు లీడర్ అంటే నరేంద్ర మోదీ అని తెలిపారు. తన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రం కోసం కొట్లాడినట్లు తెలిపారు.
ఫైనాన్స్, హెల్త్ మినిస్టర్‌గా నేను చేసిన సేవలు కూడా మీ అందరికీ తెలుసన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 65 రోజుల నుంచి రోజుకు 18 గంటల పాటు తిరుగుతున్నానని, ఎక్కడికి పోయినా ప్రతి దగ్గర నువ్వే గెలిచావు అని చెప్తున్నారని ఈటల సంతోషం వ్యక్తంచేశారు. మల్కాజ్ గిరిలోని జైన్ బాలాజీ నిలయంలోకి నన్ను అనుమతించడమే అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, మా ఎంపీ అని గర్వపడే పద్ధతిలో పనిచేస్తానని హామీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.