- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలి..
దిశ, మేడ్చల్ టౌన్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు సుశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ డిపో నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఆధారాలు లేకుండా మాట్లాడడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. ఈటల వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, సల్ల వేంకటేశ, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.