- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బలవంతంగా పదవులను కట్టబెట్టకండి
దిశ మేడ్చల్ బ్యూరో : సమాజంలో నాయకులకు కొదవలేదని, వయసుతో సంబంధం లేకుండా ఎవరు పార్టీ కోసం సమయాన్ని ఇచ్చి ప్రజలతో మమేకమవుతూ సేవలు అందించగలరో వారికి ఇన్చార్జి పదవులు ఇవ్వాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. కీసర మండలంలో శనివారం నిర్వహించిన సంస్థాగత ఎన్నికల కార్యశాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు అయింది ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే అని తెలిపారు. ఆసక్తి కలిగిన వారికి మాత్రమే ఇన్చార్జి పదవులను ఇవ్వాలని, బలవంతంగా అప్పజెప్పవద్దని తెలిపారు. లైవ్ పాలిటిక్స్ లో ఉన్న సీనియర్లకి ప్రొటోకాల్ పాటించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. పార్టీ పిలుపునిస్తే సమావేశాలు నిర్వహించడం, కార్యక్రమాలు చేయడం వంటివారికి ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు. సాధ్యమైనంత వరకు పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా చేస్తే గ్రూపుల సమస్య ఉండదని పేర్కొన్నారు.