దిశ ఎఫెక్ట్ : గ్రామపంచాయతీలపై తగ్గిన భారం..

by Kalyani |
దిశ ఎఫెక్ట్ : గ్రామపంచాయతీలపై తగ్గిన భారం..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైందని, ఈ నెల 8వ తేదీన గురువారం సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించాలని తెలంగాణ సర్కారు అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నిధుల్లేక ఊరూర చెరువుల పండుగ ను నిర్వహించలేక తలలు పట్టుకుంటున్నారని, చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైందని సర్పంచులు కార్యదర్శుల గోడును విలవిస్తూ బుధవారం దిశ డిజిటల్ మీడియాలో ప్రచురించిన విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే గ్రామ పంచాయతీల నిధుల నుంచి కేవలం రూ.50వేలు మాత్రమే నిధులను ఖర్చు చేసుకోవాలని జీవోను విడుదల చేశారు.

దీంతో గ్రామపంచాయతీలకు ఊరట లభించింది. గ్రామపంచాయతీలలో నిధుల కొరత వల్ల పడుతున్న ఇబ్బందులను దిశ డిజిటల్ మీడియా వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని జిల్లాలోని పలువురు సర్పంచులు కార్యదర్శులు దిశ మీడియాకు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story