పైశాచికం...వెంటాడి వీధికుక్కల్ని హతమార్చిన దుండగులు

by Sridhar Babu |
పైశాచికం...వెంటాడి  వీధికుక్కల్ని హతమార్చిన దుండగులు
X

దిశ, జవహర్ నగర్ : వీధి కుక్కలను విచక్షణా రహితంగా చంపకూడదని, వాటి జనాభా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరిధిలోకి రావాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఎలాంటి సోయి లేకుండా ఇష్టానుసారంగా కుక్కలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. వీధి కుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.

ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. ఓ శునకం గర్భంతో ఉన్నా వదిలేయకుండా హతమార్చారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నింధితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed