- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ఐడిఎల్ చెరువు కట్టపై నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అవినాష్ మహంతి
ఐడిఎల్ చెరువు కట్టపై నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అవినాష్ మహంతి
by Sumithra |
X
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఐడీఎల్ చెరువు కట్టను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ అవినాష్ మహంతి వెంట బాలానగర్ డీసీసీ సురేష్ కుమార్, అదనపు డీసీపి సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీపీ అవినాష్ మహాంతి అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిమజ్జనానికి వచ్చే భక్తుల బధ్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కొత్తపల్లి ముత్తు, ఎస్సై రామకృష్ణ, జీహెచ్ఎంసీ డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story