- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గూటికి గొట్టిముక్కల..?
దిశ, కూకట్పల్లి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ సీనియర్ నాయకుడు, మలిదశ ఉద్యమకారుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావును, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడింట్ డాక్టర్ మల్లురవి ఆయన నివాసంలో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పటికే గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీ రెబెల్‌గా పోటీలో ఉంటున్నట్టు ప్రకటించి తన మద్దతు దారులు, నాయకులు, అభిమానులతో కలిసి నామినేషన్‌కు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు గొట్టిముక్కల వెంకటేశ్వర్రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కూకట్పల్లి రాజకీయాలలో మరితం మార్పు చోటు చేసుకునే విధంగా ఉంది.
కూకట్పల్లి నియోజకవర్గం పై మంచి పట్టు ఉన్న నాయకుడుగా పేరున్న గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సునాయాసం అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పార్టీ అధినాయకత్వం సైతం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామ చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ ఖాళీని కాంగ్రెస్ పార్టీ వెంగళరావుకు సమీప బంధువు అదే సామాజిక వర్గం, కూకట్పల్లి గ్రామానికి చెందిన గట్టి నాయకుడైన గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని భర్తీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైన కూకట్‌పల్లిలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, జనసేన పొత్తులో టికెట్ జనసేనకు కేటాయిస్తుండటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, జనసేన పార్టీల మధ్యనే గట్టి పోటి ఉండబోతుందన్న చర్చ జరుగుతుంది.