- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి పట్టిన క్యాన్సర్ కాంగ్రెస్.. దానిని సమూలంగా నిర్మూలించాలి : ఈటల
దిశ,మేడ్చల్ బ్యూరో: కాంట్రవర్సీ స్టేట్మెంట్ లకు కేరాఫ్ అడ్రస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా ఆయన మహేంద్ర హిల్స్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెంటల్ గా ఆర్డర్ తప్పిండా..? సంచనాల కోసమే మాట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తలసాని, కడియం, పొన్నాల పై మాట్లాడిన వివాదాస్పద మాటలు ఇప్పుడు ఆయనకే సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారంటూ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పేసారని, బోఫోర్స్ స్కాం, కోల్ స్కాం, టూరిస్ట్ క్యాంప్ వంటివి అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రాహుల్ ప్రధాని అయిన తర్వాత చేస్తాను అని రేవంత్ రెడ్డి అంటున్నారని కానీ ఈ మాట అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని, ప్రజలు ఈ విషయంపై ముఖ్యమంత్రి నిలదీయాలని సూచించారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం, చేసిన పనులకు కమిషన్ లేనిదే బిల్లులు చెల్లించకుండా వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని విమర్శించారు.
దేశానికి పట్టిన క్యాన్సర్ కాంగ్రెస్..
గరీబి హటావో అని రాహుల్ గాంధీ నానమ్మ అయిన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చెప్పారని అవే మాటలు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గరీబి హటావో నినాదం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. దేశానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ విధ్వంసం అయ్యిందని, నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ లో అశాంతి నెలకొందని, అప్పట్లో బేసం విచ్చిన్నం అవుతుందా అనేలా పరిస్థితులు ఉండేవని తెలిపారు. కానీ మోడీ ప్రధానిగా అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని సర్వత్ర ప్రశాంతత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో చైనా నుండి ముప్పు ఉంటే ఇప్పుడు శత్రు దుర్భేద్యం గా భారత్ అవతరించిందని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లు అవసరం లేదు..
కాంగ్రెస్ పార్టీ అనగారిన వర్గాలను అణచివేస్తున్న పార్టీగా ఈటల పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కళ్ళు ఉన్న కబోదులు లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ముస్లిం వర్గాల్లో చాలామందికి బీసీ, ఓబీసీ కింద పేద ముస్లింలకు రిజర్వేషన్లు అందుతున్న వారికి మతాల పరంగా రిజర్వేషన్లు అవసరం లేదని బీజేపీ చెప్తుందని తెలిపారు. ముస్లిం క్రిస్టియన్ ల వర్గాలు చెందిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు చూస్తున్నారు తప్ప ఆ వర్గాలకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు.
ఓటు వేసి ఆదరించండి..
కాంగ్రెస్ పార్టీ ఓటుకు 2000 రూపాయల చొప్పున పంచుతుందని, అక్రమంగా సంపాదించిన ఆ డబ్బు ప్రజలదే గాని, ఆ పార్టీ వారు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం బీజేపీకి ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఓటర్లు ఎడ్యుకేటెడ్, వివేకవంతులని అందరూ మంచి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్, మల్కా కొమురయ్య, పిట్ల నగేష్ ముదిరాజ్,విజయ రామారావు లు పాల్గొన్నారు .