అభివృద్ధిలో దేశానికే దిక్సూచి ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన: ఎమ్మెల్యే మాధవరం

by Kalyani |
అభివృద్ధిలో దేశానికే దిక్సూచి ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన: ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: అభివృద్ధిలో దేశానికే దిక్సూచి ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి డివిజన్​ పరిధిలో 1.25 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం స్థానిక కార్పొరేటర్​ జూపల్లి సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, గత పాలకులు దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమి లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అభివృద్ధికి కేరాఫ్​ అడ్రస్​గా మారిందని అన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ముందు చూపుతోనే నిరంతర అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్​ అధ్యక్షుడు సంతోష్​, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్​, ఎస్పీ సెల్​ అధ్యక్షుడు బొట్టు విష్ణు, నాయినేని అభిలాష్​ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed