- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్‌పై కేసు నమోదు
దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ బండారి ఆంజనేయులుపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఆదివారం ఆంజనేయులు తన అనుచరులతో పట్టణ కేంద్రంలోని గోశాల, సంపూర్ణ ఆయుర్వేద వైద్యశాలలో చొరబడి సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆయుర్వేద వైద్యశాలకు అనుమతి ఉందా ఎవరు అనుమతులు ఇచ్చారు. వైద్యం చేయడానికి మీకు లైసెన్స్ ఉందా అంటూ రోగుల ముందే వాళ్ళని నిలదీసి న్యూసెన్స్ చేయడంతో ఆయుర్వేద నిలయం యజమాని నల్లబోతు వెంకటేశ్వర్లు, ఆంజనేయులుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆంజనేయులుపై ఘట్కేసర్ ఎస్సై అశోక్ సెక్షన్ 447,504,506,290, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫిర్యాదుదారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదులు పేర్కొన్నట్లుగా కేవలం ఆంజనేయులు పై కేసు నమోదు చేయడం అతని అనుచరులను వదిలిపెట్టడం పై పోలీసులపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.
Read More..