- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటోన్మెంట్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం మొండా మార్కెట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో రూ. 56లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, రూ. 54 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఫుట్ పాత్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం దివంగత సాయన్న ఎంతో కృషి చేశారని, ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు.
ఆయన లేకున్నా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తానని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి, నాయకులు హరికృష్ణ, జయరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.