ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు : బండారి లక్ష్మారెడ్డి

by Sumithra |
ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు : బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, నాచారం : బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మేనిఫెస్టో పై ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్మారెడ్డి సూచించారు.

సోమవారం మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరుణాకర్ గౌడ్ ఉప్పల్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరుణాకర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి విజయానికి తోడ్పడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ కాటర్ల భాస్కర్, పార్టీ నాయకులు రంగు ప్రసాద్, అల్లాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed