జీహెచ్ఏంసీ ఎన్నికల్లో వికసించేది బీజేపీనే.. ఏంపీ ఈటల రాజేందర్

by Sumithra |
జీహెచ్ఏంసీ ఎన్నికల్లో వికసించేది బీజేపీనే.. ఏంపీ ఈటల రాజేందర్
X

దిశ, మల్కాజిగిరి : రానున్న మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురనుందని మల్కాజిగిరి ఏంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను బీజేపీలో ఉన్నందుకు బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు, 140 కోట్ల ప్రజలున్న భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి బీజేపీ నాయకత్వమేనని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే బీజేపీకి 35 శాతం ఓట్లు వచ్చాయని, ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనన్నారు. ఆదివారం మల్కాజిగిరిలో నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి, ఆకారం సాయితో పాటు పలువురు ఏంపీ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఏ పార్టీలో అయినా జాతీయ అధ్యక్షుడు దగ్గరనుండి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఈ పార్టీ నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బ్రతకదనీ, పార్టీకి ప్రతి ఒక్కరూ ఓనర్లెనన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీననీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి ఆకర్షితులై పలువురు మేధావులు పార్టీలో చేరుతున్నారన్నారు.

దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనిపించడం లేదనీ సీనియర్ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారన్నారు. మహాభారతంలో సంజయుడికి మాత్రమే ఎక్కడ ఏం జరుగుతుందో చూసే శక్తి ఉండేది.. ఆయనే ధృతరాష్ట్రునికి యుద్ధంలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చెప్పేవాడు. కానీ ఈనాడు సెల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి సామాన్యుడు తెలుసుకుంటున్నా ప్రతి ఒక్కరూ సంజయుడేనన్నారు. సిరియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్ధాన్, బంగ్లాదేశ్ లో జరుగుతున్న నరమేదాన్ని గమనిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే స్థితిని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీదేనన్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే మనది మాత్రం స్థిరంగా ఉండటమే కాదు ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశాన్ని 11 వ స్థానం నుండి 5వ స్థానానికి ఎదిగిందన్నారు. మూడవ స్థానంలో నిలబెట్టాలి అనేది మోడీ సంకల్పమన్నారు. నేరేడ్మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డితో పాటు పలువురుని పార్టీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తో పాటు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed