- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. రౌడీలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే ..
దిశ,కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద వీధి రౌడీలా చెలరేగి పోయాడు. సహనం కోల్పోయి ఇక్కసారిగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసి గొంతు నొక్కి గాయపరిచారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా సమస్యలపై ఓ టీవీ ఛానల్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో బుధవారం ఓపెన్ డిబేట్ కార్యక్రమం నిర్వహించింది.ఈ డిబేట్ లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ లో బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొలన్ హన్మంత్ రెడ్డి పోటీ లో ఉన్నారు. ఆ టీవీ ఛానల్ ఓపెన్ డిబేట్ కు వీరు ముగ్గురు హాజరయ్యారు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో జరిగిన భూ కబ్జాల విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లకు మాట మాటపెరిగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుత్బుల్లాపూర్ లో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఎక్కువైందని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో వందల ఎకరాలు కుత్బుల్లాపూర్ లో కబ్జాలు అయ్యాయని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విమర్శలు గుప్పించారు. ఒక్కసారిగా సహనం కోల్పోయిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై వీధి రౌడీలా దాడి చేశాడు.దాడి అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంతు నులిమి గాయపరిచారు.ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న టీవీ యాంకర్స్, పోలీసులు వారిస్తున్న వినకుండా ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిపై దాడికి దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, బీజేపీ వర్గాలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు కలగచేసుకుని ఇరువురు అభ్యర్థుల అనుచరులను చెదరగొట్టారు. డిబేట్ లో రాజుకున్న ఈ గొడవ ఎంత వరకు దారి తీస్తుందో, ఏ పరిణామాలను కలిగిస్తుందో అనే ఆందోళనలో ఇరు పార్టీలకు చెందిన సామాన్య కార్యకర్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.