- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూకట్పల్లిలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు...
దిశ, కూకట్పల్లి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రకృతి నుంచి లభించిన పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండగ. తెలంగాణ ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు కూకట్పల్లి గ్రామం ముస్తాబయింది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు కూకట్పల్లి గ్రామానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతలకన్నా ముందు, అమావాస్యకు ఒక రోజు ముందే కూకట్పల్లి గ్రామంలో బతుమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. దేశ విదేశాలలో, పొరుగు రాష్ట్రాలలో, వేరే ఊర్లలో ఉండే గ్రామ ఆడబిడ్డలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు కూకట్పల్లిలోని తమ పుట్టింటికి చేరుకుంటారు. 9 రోజుల పాటు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తారు. విజదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మ వేడుకలను చూసేందుకు కూకట్పల్లి పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది సంఖ్యలో జనం కూకట్పల్లి బాట పడుతారు. సద్దుల బతుకమ్మ నాడు గ్రామానికి చెందిన ప్రతి ఇంటి నుంచి భారీ బతుకమ్మలను పేర్చి గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తారు.
రెండు రోజుల ముందే..
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కూకట్పల్లి గ్రామంలో ఈ సారి అమావాస్యకు రెండు రోజుల మందే ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా అమావాస్యకు ఒక రోజు ముందు ప్రారంభించాల్సిన వేడుకలు బుధవారం అక్టోబర్ 4 అమావాస్య, ఒక రోజు ముందు మంగళవారం వస్తుండటంతో సోమవారం అక్టోబర్ 2వ తేదీన బతుకమ్మ వేడుకలు ప్రారంభిస్తున్నట్టు బతుకమ్మ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు కంచనపల్లి నాగరాజు తెలిపారు.
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు పూర్తి..
తెలంగాణ ఆడపడుచులు ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు కూకట్పల్లిలో సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని, బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. సోమవారం బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతున్నాయని, బుధవారం అక్టోబర్ 4 పెద్దల అమావాస్య, 8వ తేదీన అట్ల బతుకమ్మ, 9వ తేదీన బతుకమ్మ అలిగిపోవడం, 10వ తేదీన సద్దుల బతుకమ్మ, 12వ తేదీన విజయదశమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజయదశమి రోజు కూకట్పల్లి గ్రామంలోని రామాలయం వద్ద సాయంత్రం 5:30 గంటలకు జమ్మి పూజ, రంగధాముని చెరువు వద్ద విద్యుత్ కాంతుల వెలుగులతో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కనులవిందుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.