- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లైఓవర్ కింద ఖాళీ ప్రదేశంలో ఇండోర్ క్రీడా ప్రాంగణం
దిశ, కూకట్పల్లి : క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా కేపీహెచ్‌బీ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఇండోర్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్‌బీ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. డివిజన్ పరిధిలోని మలేషియన్ టౌన్షిప్ వెకనకాల 5 ఎకరాలలో చేపడుతున్న పార్కు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పక్కనే ఉన్న మరో ఐదు ఎకరాల స్థలంతో పాటు తొమ్మిదవ ఫేజ్‌లోని మూడు ఎకరాల స్థలాన్ని జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలో
అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి, జిల్లా మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. వన్సిటీ పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాన్ని మహిళా పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు రోడ్డుపై నీళ్లు నిలవకుండా ఉండేలా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఫోరం మాల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఖాళీ స్థలాన్ని ఇండోర్ క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 4వ ఫేజ్‌లోని ఎస్టీపీ ప్లాంట్ వద్ద ఫ్లైఓవర్ కింద ఉన్న చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా పనులను చేపట్టాలని సూచించారు. కేపీహెచ్‌బీ డివిజన్లో వేల కోట్ల రూపాయలతో గత పది ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ సర్కిల్ ఈఈ శ్రీనివాస్, డీఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, యూబీడీ అధికారి సమత, జలమండలి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకటేష్, రాజేష్, భవాని పాల్గొన్నారు.