నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుషం..

by Aamani |
నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుషం..
X

దిశ, తిరుమలగిరి : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉల్లాసంగా జరుపుకొనే పండగ బోగి సంక్రాంతి పండగ వేడుకలు.ఈ పండుగ వేడుకలను తమ సొంత ఊరిలోనే జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఉద్యోగాల రీత్యా,వ్యాపారపరంగా,పై చదువుల కోసం వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడి ఉంటారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ స్వస్థలాలకు వెళ్లి స్నేహితులు బంధువులతో పండుగ రోజుల్లో గడిపి పిండి వంటకాలతో సంతోషంగా గడిపేందుకు నగరవాసులు పల్లెలకు పయనమయ్యారు.దీంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్ళు నిర్మానుష్యంగా మారాయి.ప్రతిరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులు,ఇతర వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ బస్టాండ్ ఏరియా,తిరుమలగిరి చౌరస్తా,టివోలీ,జింఖానా గ్రౌండ్స్,పికెట్,ఖార్ఖానా రహదారులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి.

ప్రతిరోజు నిత్యం ఎన్నో వందల వాహనాలు ప్రయాణిస్తుండడంతో శబ్ద కాలుష్యంతో పాటు,ట్రాఫిక్ జాములు ఏర్పడుతుండేవి.పండుగ సందర్భంగా నగరవాసులు సొంత ఊర్లకు వెళ్లిపోవడంతో నగరంలోని ప్రధాన కూడళ్ళు,రహదారులు నిర్మాణుష్యంగా మారాయి.ఒక్క నిమిషంలో నగరంలోని పలుకూడళ్ళ వద్ద వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిచిపోతుండేవి.కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు.పండుగ సందర్భంగా సొంత ఊర్లకు కొందరు సొంత వాహనాల్లో,వాహనాలు లేని వారు బస్సుల్లో,రైళ్లలో నగరవాసులు తమ స్వంత ఊర్లకు తరలి వెళ్లడంతో నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు,శబ్ద కాలుష్య సమస్యలు లేకుండా పోయాయి.నిత్యం సిటీలో రణ గొన ధ్వనులతో వాహనాలు,కిక్కిరిసిపోయే కూడళ్లు అన్ని నిర్మానుషంగా బంద్ ను తలపించే విధంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed