Director Sukumar: సుకృతి జీవితంలో ఇదొక మంచి జ్ఞాపకం.. దర్శకుడు సుకుమార్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2025-01-17 11:53:38.0  )
Director Sukumar: సుకృతి జీవితంలో ఇదొక మంచి జ్ఞాపకం.. దర్శకుడు సుకుమార్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి (Sukriti Veni) బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). డైరెక్టర్ పద్మావతి మల్లాది తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. ఇక ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ (International Film Festival)లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. అంతే కాకుండా ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. భారీ అంచనాల మధ్య ‘గాంధీ తాత చెట్టు’ జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ (Theatrical release) చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌ (Promotions)లో భాగంగా తాజాగా మూవీ యూనిట్‌ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైనా డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) మాట్లాడుతూ.. ‘సుకృతికి చిన్నప్పటి నుంచి సింగింగ్‌ (Singing) అంటే చాలా ఇష్టం. తనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ దర్శకురాలు పద్మ, నిర్మాతల్లో ఒకరైన సింధు యాక్టింగ్‌కు ఒప్పించారు. ఈ ఇద్దరిది సినిమా విషయంలో ఎంతో పెద్ద జర్ని. సుకృతి నటిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నమ్మకం లేదు. కానీ దర్శకురాలు పద్మని అడిగితే మాత్రం బాగా నటిస్తుంది అని చెప్పేది. మెహమాటానికి సినిమా చేయకు అని చెప్పాను. కానీ సుకృతి యాక్టింగ్‌ చూసిన తరువాత షాక్‌ అయ్యాను. అంత బాగా నటించింది. నా కూతురు ఈ సినిమాలో బాగా చేసింది అని చెప్పడానికి నేను ఏ మాత్రం సందేహించను. ఈ సినిమాను పద్మ, సింధులు ఎంతో కష్టపడి పట్టుదలతో పూర్తిచేశారు. ఈ సినిమా సుకృతి లైఫ్‌లో ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సినిమా అంటే బిజినెస్‌ (Business).. ఇన్వెస్ట్‌ చేసిన ఏదైనా బిజినెసే.. సినిమా కూడా అంతే. అయితే.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేసేజ్‌ ఇచ్చే సినిమా చేయడం అదృప్టం. గాంధీ తాత చెట్టులో ఈ రెండూ ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

సుకృతి (Sukriti) బండ్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో కంఫర్టబుల్‌గా చేశాను. దర్శకురాలు పద్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆమె కోసమే నా హండ్రెడ్‌ పర్సెంట్ ఎఫర్ట్‌ పెట్టాను. ఈ సినిమా కోసం నాన్న ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. ఈ సినిమాలో అందరితో ఎంతో కంఫర్ట్‌గా నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన అందరికి నా థాంక్స్‌’ అని తెలిపింది.

Next Story

Most Viewed