కుచిర్యాల గ్రామ సమస్యలు తీర్చే బాధ్యత నాది : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

by Kalyani |
కుచిర్యాల గ్రామ సమస్యలు తీర్చే బాధ్యత నాది : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
X

దిశ, బోథ్ : మండలంలోని కుచిర్యాల గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు ఎమ్మెల్యేకు హారతి పడుతూ స్వాగతం పలికారు. గ్రామంలో గల జగదాంబ దేవి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో గ్రామంలో అన్ని సిసి రోడ్లు నిర్మిస్తామని, త్వరలో బీటీ రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తామని, ఒక్కొక్కటిగా గ్రామ సమస్యలు అన్ని తీర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ లు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed