లైంగిక వేధింపుల కేసులో పాస్టర్ బజీందర్ సింగ్‌‌కు జీవిత ఖైదు

by Mahesh |
లైంగిక వేధింపుల కేసులో పాస్టర్ బజీందర్ సింగ్‌‌కు జీవిత ఖైదు
X

దిశ, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల కేసు (Sexual harassment case)లో పాస్టర్ బజీందర్ సింగ్‌‌ (Pastor Bajinder Singh)కు మొహాలీ పోక్సో (POCSO) కోర్టు జీవిత ఖైదు (life imprisonment) విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. 2018లో జీరక్‌పూర్‌లో జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసు 2018 లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు నమోదైంది. ఆమె ఆరోపణ ప్రకారం.. బజీందర్ సింగ్ (Bajinder Singh) తనను విదేశాలకు తీసుకెళ్తానని ఆశ చూపి తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (అత్యాచారం), 323 (గాయపరచడం), 506 (బెదిరింపు) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుదీర్ఘంగా సాగిన దర్యాప్తు, విచారణల తర్వాత మార్చి 28, 2025 న మొహాలీ కోర్టు బజీందర్ సింగ్‌ను దోషిగా ప్రకటించింది. ఈ మేరకు యువతిపై లైంగిక వేదింపులకు పాల్పడినందుకు బజీందర్ సింగ్‌కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. కానీ బజీందర్ సింగ్ (Bajinder Singh) మినహా.. ఆరుగురిని సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించారు.



Next Story

Most Viewed