- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
VC Sajjanar: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ (VC Sajjanar) పిలుపునిచ్చారు. ఈ మేరకు #SayNoToBettingApps ట్యాగ్‌తో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముందు మీకు గెలుపు రుచి చూపిస్తుందని, ఆ తర్వాత మిమ్మల్ని ఓడిస్తూనే ఉంటుందని తెలిపారు. గుర్తుపెట్టుకోండి.. ఓడిపోతున్న కూడా రెట్టించిన ఉత్సాహంతో ఆడించి సొమ్ము చేసుకోవడమే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల లక్షణం అని, ఉన్నదంతా ఊడ్చుకుపోయేదాకా ఆడిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదని, గెలుపు రుచి ఎరకు మంత్రముగ్దులై జీవితాలను నాశనం చేసుకోకండని వెల్లడించారు. ఈ ఐపీఎస్ మ్యాచులను ఎంజాయ్ చేయండి.. అంతవరకు తప్పులేదని, ఎంటర్టైన్మెంట్ పేరుతో మీ జేబులను గుల్ల చేసుకోకండని సూచించారు.