- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెన్నయ్, ఢిల్లీ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ తల్లిదండ్రులు.. అందుకే వచ్చారంటూ పోస్టులు

దిశ, స్పోర్ట్స్ :టీమిండియాకు ఆడేటప్పుడుగానీ, ఐపీఎల్‌లోగానీ ఎం.ఎస్ ధోనీ ఆడుతున్నాడంటే ఆ మ్యాచ్‌లకు ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ తప్పకుండా హాజరవుతుంది. ధోనీ కూతురు జీవా కూడా అప్పుడప్పుడు మైదానాల్లో కనిపిస్తుంటుంది. కానీ, ధోనీ తల్లిదండ్రులు మాత్రం మైదానంలో కనిపించడం చాలా అరుదు. ధోనీ మ్యాచ్‌లకు కూడా హాజరైన సందర్భాలు కూడా చాలా తక్కువ.
అయితే, చెపాక్ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ధోనీ తల్లిదండ్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధోనీ పేరేంట్స్ పాన్ సింగ్ ధోనీ, దేవకి దేవి మ్యాచ్‌ను వీక్షించారు. ధోనీ భార్య సాక్షి, కూతురు జీవా కూడా హాజరయ్యారు. ఎప్పుడూ రాని ధోనీ తల్లిదండ్రులు చెపాక్ స్టేడియానికి రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవడంతోపాటు కొద్దిగా ఆందోళన కూడా గురయ్యారు. ఈ మ్యాచ్ తర్వాత మాహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అన్న టెన్షన్ వారిలో కనిపించింది. ధోనీ చివరి మ్యాచ్‌ను చూసేందుకే అతని తల్లిదండ్రులు వచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ధోనీ రిటైర్మెంట్ రూమర్లను చెన్నయ్ ఫ్రాంచైజీ కొట్టిపారేసింది. ప్రకటన ఇవ్వకపోయినా ట్విట్టర్‌లో ‘సందర్భం కాదు’ అంటూ ఓ మీమ్‌తో బదులిచ్చింది.
No context. 🧢💛 pic.twitter.com/ypZXeQffG5
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2025