Aadhaar: ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే ‘హలో’ అనగలం.. కఠిన రూల్స్ తెచ్చిన మోడీ సర్కార్

by Jakkula Mamatha |   ( Updated:2025-01-17 10:48:04.0  )
Aadhaar: ఇకపై ఆధార్ కార్డు ఉంటేనే ‘హలో’ అనగలం.. కఠిన రూల్స్ తెచ్చిన మోడీ సర్కార్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో టెక్నాలజీ(Technology) ఎంత అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. అయితే టెక్నాలజీని అనుకూలంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసగాళ్లు(Cyber ​​fraudsters) మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగదారులను మోసం చేసి బ్యాంకులో ఉన్న సొమ్మును దోచుకుంటున్నారు. ఈ మోసం కేసుల నుంచి కస్టమర్లను సేవ్ చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) ఈ 2025లో కొత్త SIM కార్డ్‌లను కొనుగోలు చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

అసలు విషయంలోకి వెళితే.. సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇక నుంచి కొత్త సిమ్ జారీ చేసేందుకు ఆధార్ కార్డు(Aadhaar Card) తప్పనిసరి. ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు(Govt IDs) ఉంటే కొత్త సిమ్ ఇచ్చే వారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు(SIM Card) ఇవ్వరు.



Next Story

Most Viewed