- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం దొరకడం లేదని యువకుడి ఆత్మహత్య..
దిశ, కుత్బుల్లాపూర్: సరైనా ఉద్యోగం దొరకడం లేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుసపాటి రాజు (23) తల్లిదండ్రులతో కలిసి గాజులరామారం దేవేందర్ నగర్ నర్సింహా బస్తీలో నివాసం ఉంటున్నాడు.
రాజు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి రెండేళ్లు గడిచింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో రెండేళ్లుగా ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగ అవకాశం రాలేదు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా ఉండలేక పోతున్నానని, చదివిన చదువు వృథా అయిందని తీవ్ర మనస్థాపం చెందిన రాజు మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.