ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది..?

by Kalyani |
ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది..?
X

దిశ, శామీర్ పేట: మద్యం మత్తులో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన ప్రకారం.. అస్సాంకు చెందిన శ్రీ ప్రొబిన్ బోర (41), తీటరాంలు లాల్ గడి మలక్ పేట్ గ్రామ పరిధిలోని హైటెక్ సీడ్ కంపెనీలో గత ఏడాదిగా సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తున్నారు.

ఆదివారం రాత్రి వారి మధ్య ఘర్షణలో శ్రీ ప్రొబిన్ ను కత్తితో గొంతు కోసి చంపి భావిలో పడేశానని కంపెనీలో పనిచేస్తున్న వారికి ఫోన్ చేసి చెప్పి నిందితుడు తీటారం పరారయ్యాడు. విషయం తెలుసుకున్న శామీర్ పేట్ పోలీసులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గళ్లంతైన శ్రీ ప్రొబిన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం సంఘటన స్థలంలో లభ్యమైన సామాగ్రిని సీజ్ చేసి బావిలో నుంచి మృతదేహన్ని వెలికి తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed