- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tech Mahindra : టెక్ మహీంద్రలో ఘనంగా 3వ స్నాతకోత్సవం..
దిశ, దుండిగల్ : మానవ విలువలతో కూడిన విద్య సమాజంలో ప్రతి వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ టెక్ మహీంద్రా యూనివర్సిటీలో జరిగిన మూడవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో మహీంద్రా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా ప్రారంభమైనప్పటి నుండి దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన క్యాంపస్‌గా రూపాంతరం చెందిందని స్నాతకొచ్చవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మీరు సాధించిన విజ్ఞానము, నైపుణ్యాలతో సాధించిన డిగ్రీ రేపటి మీ భవిష్యత్తుకు పునాది అవుతుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అనేక సవాళ్ళను ఎదుకర్కోవలసి వస్తుందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా, పారిశ్రామిక యుగం సమాచార యుగానికి దారితీసిందని.
మార్పు ప్రపంచాన్ని అన్ని రకాల సరిహద్దుల్ని అనుసంధానించిందన్నారు. మేధో వనరులు సమాచార విస్ఫోటనానికి అనుగుణంగా లేవన్నారు. ఎదురుకోవడానికి తగిన మేధో మధనం జరగాలన్నారు. అన్ని రంగాలలో సైన్స్ ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వేగంగా మారుతున్న ప్రపంచానికి అనువైన అతి చురుకైన జీవన విలువల గురించి దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రపంచంతో పోటీ పడడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీ శక్తి సామర్థ్యం నైపుణ్యము ఇందుకు ఉపయోగపడతాయని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఆనంద్ మహేంద్ర, గెస్ట్ అఫ్ హానర్ శోభన కామినేని, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.