- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ
X
దిశ, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 20 తులాల బంగారం, రూ.2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సంఘటన రాచకొండ కమిషనరేట్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ లో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం అంకుషాపూర్ కు చెందిన కొట్టి రవీందర్ రెడ్డి(65) కుటుంబ సభ్యులతో తన సమీప బంధువు షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు.
Advertisement
Next Story