- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MEDARAM : మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రులు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో ఇవాళ మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారుల చేస్తున్న ఏర్పాటలను వారు పరిశీలించనున్నారు. అయితే, జాతర మొదలయ్యేందుకు ఇంకా నెల రోజులు సమయం ఉన్నా అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులు ముందుగా స్థానిక జంపన్న వాగులో స్నానా చేసి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని మంత్రులు సీతక్క, సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.75 కోట్ల నిధులతో మొదలు పెట్టిన పనులను నెలాఖరు లోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశించారు.
Advertisement
Next Story