గంజాయి అమ్ముతూ.. పట్టుబడిన యువకులు

by Shiva |
గంజాయి అమ్ముతూ.. పట్టుబడిన యువకులు
X

దిశ, అల్లాదుర్గం: అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామం నందిని డాబా వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు బి.అరవింద్, పి.విజయ్ కుమార్ గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హీరో హోండా బైక్, యాక్టివా వాహనాలను తనిఖీ చేయగా 240 గ్రాముల ఎండు గంజాయి లభించింది. వారిద్దరిపై కేసులు నమోదు చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మరొక వ్యక్తి నడిమి తండాకు చెందిన దేవసోత్ మోతిలాల్ పరారీలో ఉన్నట్లుగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ భీంరెడ్డి రాంరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది, చంద్రయ్య, ఎల్లయ్య, నవీన్, నరేశ్, హరీశ్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story