- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురవెల్లి ప్రసాదంలో పురుగులు
దిశ, కొమురవెల్లి : కోరిన కోర్కేలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఏదో ఒక అంశం తో వివాదాల్లోకి ఎక్కుతుంది. ఇటీవల రూ. 3 కోట్ల ఫైళ్ళు మాయమైన ఘటన మరువకముందే, తాజాగా మరో అంశంతో మల్లన్న ఆలయం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో అధికారుల పర్యవేక్షణ లోపించి, స్వామివారి ప్రసాదంలో పురుగులు ప్రత్యక్షమైన సంఘటన ఆదివారం కలకలం రేపింది. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి లడ్డూ, పులిహోర, సీర ప్రసాదలను భక్తులు కొనుగోలు చేస్తుంటారు. ఆదివారం హైదరాబాద్ కు చెందిన భక్తులు పులిహోర కొనుగోలు చేయగా అందులో పురుగులు కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 అమ్మే 200 గ్రాములు ఉండాల్సిన పులిహోర ప్యాకెట్ 160 గ్రాములే ఉండటంపై, అధికారుల పర్యవేక్షణ లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉంటే అధికారుల పర్యవేక్షణ, ప్రసాదం తయారు చేయించే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే నాణ్యత లోపించిందని స్థానిక భక్తులు మండిపడుతున్నారు.
పులిహోరలో పురుగు లేదు: ఈవో బాలాజీ
స్వామి వారి పులిహోరలో పురుగు ప్రత్యేకమైన సంఘటన నేపథ్యంలో మల్లన్న ఆలయ ఈ ఓ బాలాజీని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అటువంటిది ఏమీ లేదన్నారు. ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రసాదం తయారు చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.