ట్రాన్స్ జెండర్స్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దు.. సీఐ అవగాహన

by Nagam Mallesh |
ట్రాన్స్ జెండర్స్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దు.. సీఐ అవగాహన
X

దిశ- పటాన్ చెరుః ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దని వాటికి దూరంగా ఉండాలని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి ట్రాన్స్ జెండర్స్ కు సూచించారు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గత కొంతకాలంగా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు, ఇతర రహదారుల పక్కన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పటాన్ చెరు పోలీసులకు దృష్టికి రావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్ కు వాళ్లను పిలిపించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ రెడ్డి వారికి అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జనజీవన స్రవంతిలో మంచి నడవడిక పెంపొందించుకునేలా ఉత్తమ వ్యక్తులుగా జీవించాలన్నారు.

Advertisement

Next Story