- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సేంద్రియ వ్యవసాయంపై మహిళా రైతులకు శిక్షణ
దిశ, జహీరాబాద్: న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామంలో సేంద్రియ ఎరువులు, కషాయలపై మహిళా రైతురకు డీడీఎస్- కేవీకే శాస్త్రవేత్తలు శిక్షణనిచ్చారు. డీడీఎస్- కేవీకే శాస్త్రవేత్తలు వి.రమేష్ పంటల యాజమాన్యం, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం , పంచగవ్య తయారీ విధానం, పంచగవ్యలో ఉండే పోషకాలు, ఎంత మోతాదులో వాడాలి, నిలువ కాలము, ఏ సమయంలో వాడాలలో ప్రదర్శనతో అవగాహన కల్పించారు.
ఏన్.స్నేహాలత చిడ పీడలను నివారించే దశపర్ని కషాయం తయారీ విధానం, ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు వాడాలి ప్రదర్శించి చూపించారు. అదేవిధంగా అకు మచ్చ తెగులును నివారించడానికి పుల్లటి పెరుగు ద్రావణం, ఎండు తెగులును తట్టుకోవడానికి ట్రైకోడర్మ విరిడితో విత్తన శుద్ధి, భూమిలో పెంట ఎరువుతో వేసి నివారించే పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీఎష్ స్టాఫ్ లయ, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, సంఘ సూపర్ వైజర్ వినయ్ కుమార్, నర్సమ్మ, అల్గొల్ నర్సమ్మ, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.